మరి కొద్ది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే బ్రేకప్ చెప్పుకున్న స్టార్ లవ్ బర్డ్స్..!

ఇది నిజంగా అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి . నిన్న మొన్నటి వరకు జాన్ జిగిడి రేంజ్ లో అతుక్కుపోయి మరి మేము లవర్స్ అంటూ తెగ రాసుకొని పూసుకుని తిరిగేసిన బాలీవుడ్ కాంట్రవర్షియల్ లవ్ జంట అర్జున్ కపూర్ – మలైకా అరోరా బ్రేకప్ చెప్పకున్నారా ..?? అంటే ఎస్ అన్న సమాధానమే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ మలైకా – అర్జున్ కపూర్ ని దూరం పెడుతుందట .

ఆయన ఆమెకు దగ్గర అవ్వాలని చూస్తున్నా సరే మలైకా అరోరా ఆయనను దూరం పెడుతూ ఆయనతో బయట తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదట . అంతేకాదు ఆయన ఫోన్ చేసిన కూడా లిఫ్ట్ చేయకుండా ఆయన నెంబర్ను బ్లాక్ చేసి పడేసిందట . అంతేకాకుండా మలైకా అరోరా.. మరో స్టార్ హీరోతో క్లోజ్ గా ఉంది అన్న రూమర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా అరోరా – అర్జున్ కపూర్ లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .

ఆంటీ వయసు ఉన్న ఆమెతో యంగ్ హీరో నీకేంటి డేటింగ్ అంటూ చాలామంది ఆయనను ట్రోల్ చేశారు. కానీ అర్జున్ కపూర్ మాత్రం సిన్సియర్గా మలైకా అరోరాను ఇష్టపడుతూ వచ్చారు. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఈ జంట విడిపోయినట్లు సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫాన్స్ కూడా ఫుల్ డీలా పడిపోయారు. అసలు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అన్న కామెంట్స్ చేస్తున్నారు..!!