అల్లు అర్జున్ సజెషన్ ఫాలో అవుతున్న‌ మంచు లక్ష్మి.. ఏం చేసిందంటే..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మంచు డాక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె మొదట్లో హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కొన్ని సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ పరంగా ఫుల్ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈమె మొంబైల్లో నివాసం ఉంటూ బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని టాక్. ముంబై వెళ్ళిన తర్వాత తన వేషధారణ పూర్తిగా మార్చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల బికినీలో కనిపించి నెట్టింట‌ రచ్చ రేపింది.

ఇక కొత్త ఏడదిలో అడుగుపెట్టిన తరుణంలో ఈ విధంగా చెప్పుకొచ్చింది. తాను ఫుడ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఇకపై ఈ నెల అంతా త‌ను రైస్, అలాగే నాన్ వెజ్ అసలు ముట్టుకోనని.. వాటిని తినడం పూర్తిగా మానేశానంటూ చెప్పుకొచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసిన ఈ బ్యూటీ తను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడానికి గల కారణాన్ని వివరించింది. ఏదైనా ఓ నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం అందరికీ తెలిసేలా చేయాలి అంటూ బ‌న్ని తనకు సజెషన్ ఇచ్చాడని ఆ విషయాన్ని అందుకే అందరితో షేర్ చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇలా తను ఇకపై రైస్, నాన్ వెజ్ తినను అంటూ చేసిన పోస్ట్‌కి అల్లు అర్జున్ స్పందిస్తూ ఆల్ ది బెస్ట్ అని రిప్లై ఇచ్చాడు. ఇక మంచు లక్ష్మి మంచి ఫుడ్డీ అన్నా సంగతి అందరికీ తెలుసు. ఈమె ఎక్కడికైనా వెళ్తే ఆ ఏరియాలో స్పెషల్స్ ఏంటో కనుక్కొని మరీ గట్టిగా లాగించేస్తూ ఉంటుంది. అలాంటిది రైస్, నాన్ వెజ్ తినకుండా ఉంటానంటూ పోస్ట్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే కేవలం రైస్, నాన్ వెజ్ తప్ప మిగ‌త ఫుడ్ ఏదైనా ఫుల్ గా లాగించేస్తారా మేడం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్స్‌.