రాజకియాలోకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..? జగన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

మరికొద్ది వారాల్లోనే ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే ఏపీలో ఫుల్ హీట్ ఎక్కించే పాలిటిక్స్ స్ట్రాటజీలు వేయడం మనం చూస్తున్నాం . ఇప్పటికే తెలుగుదేశం జనసేన మేర్జ్ అవ్వడం.. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేయడం వైసిపి గవర్నమెంట్ కు చెక్ పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే జగన్ కూడా తనదైన స్టైల్ లో స్ట్రాటజీలను మార్చేస్తున్నారు.

ఏ నియోజకవర్గంలో అయితే తమ మెంబర్స్ గెలుస్తారు అన్న నమ్మకం ఉందో వాళ్ళకి టికెట్లు ఇస్తూ మిగతా టైం పాస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వడం లేదు. అంతేకాదు రీసెంట్గా జగన్ మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సినిమా రంగానికి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీస్ ని ఏపీ రాజకీయ పాలిటిక్స్ ప్రచారాల్లోకి దింపాలి అంటూ డిసైడ్ అయ్యారట . అంతేకాదు స్టార్ డైరెక్టర్ వివి వినాయక కూడా వైసిపి పార్టీలో చేరబోతున్నారు అని .. కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది.

ఆల్రెడీ వివి వినాయక్ కి సంబంధించిన కొందరు బంధువులు వైసిపి పార్టీలో ఉన్నారు . ఆ కారణంగానే వి వి వినాయక్ ని కూడా వైసిపిలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారట . అంతేకాదు వివి వినాయక ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది . సినిమాల పరంగా ఎంత టాప్ పొజిషన్లోకి వెళ్లి సెటిల్ అయ్యాడో.. అదేవిధంగా ప్రజాసేవ కూడా చేస్తాడు. ఠాగూర్ సినిమాని అంతా అద్భుతంగా తెరకెక్కించడం మామూలు విషయం కాదు . అందుకే వైసిపి లో ఆయనను జాయిన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట వైసిపి నాయకులు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!