అయోధ్య ప్రతిష్ట నాడు ఆలియా కట్టిన ఈ సింపుల్ చీర ధర ఎంతో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మనందరికీ సుపరిచితమే. అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ” ఆర్ఆర్ఆర్ ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇక ఈమె రణబీర్ నీ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరూ 2022న ఏప్రిల్ లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక తాజాగా వీరిద్దరికీ ఓ పాప కూడా జన్మించింది. ఆ ముద్దుగుమ్మ పేరు రహా. ఇక వీరిద్దరూ తమ పాపని మీడియా ముందుకి తీసుకువచ్చారు. ఇక తాజాగా అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు అలియా కూడా హాజరైంది. ఇక ఆరోజు ఈమె ధరించిన చీర ఖరీదు ఎంత అని చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక తాజాగా ఈమె చీర గురించి పలు విషయాలు బయటపడ్డాయి. తాజాగా హాలియా కట్టుకున్న ఈ అందమైన సిల్క్ చీరను మాధుర్య క్రియేషన్స్ వారు డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చీరను ఈమె కోరిక మేరకు పది రోజుల్లో తయారుచేసి ఇచ్చారట. ఈ చీర పై ఎంతో అందంగా రామాయణంలోని ముఖ్యమైన ఘటనాలను డిజైన్ చేశారు. ఇక ఈ చీర ధర అక్షరాల 50,000 అని సమాచారం. ఇక ఈ చీర ధర చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు.