ప్రియాంక అరుణ్ మోహన్ లేటెస్ట్ శారీ పిక్స్ వైర‌ల్‌.. ఆ చీర‌ కాస్ట్ తెలిస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి..

గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక అరుణ్ మోహన్. నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం సినిమాలలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మెప్పించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. నటనకు మంచి మార్కులు వచ్చిన.. ఈమె నటించిన సినిమాలేవి సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రావడం లేదు.

అయితే కోలీవుడ్ లో వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటు బిజీగా ఉంటున్న ప్రియాంక.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ.. తరచు తన గ్లామర్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్‌కు మతిపోగొడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బూడిద రంగు మోడ్రన్ చీరలో దర్శనమిచ్చింది. ఈ ఫొటోస్ ను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో.. ఈ చీర ఆమెకు ఎంతో బాగా సెట్ అయిందని.. చీర రంగు, డిజైన్ కూడా చాలా బాగుందంటూ ధర కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు.

ఇక ప్రస్తుతం ఈ చీరపిక్స్‌, కాస్ట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చినియాంసంగా మారాయి. ఈ శారీ ధ‌ర అక్ష‌రాల రూ.5,29, 000 అని తెలిసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఒక చీర కోసం ఇంత డబ్బులు తగలబెట్టాలా.. ఒకసారి కట్టిన చీర మళ్ళీ ఎప్పుడో కానీ కట్టరు.. కడతారో లేదో కూడా తెలియదు.. అలాంటి దానికి ఇన్ని లక్షలు పెట్టడం అవసరమా అంటూ.. ఈ డబ్బుతో ఎవరికైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకునే వాళ్ళు కదా అంటూ.. నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.