” సలార్ ” మేకర్స్ ని అక్కినేని అఖిల్ కలవడానికి వెనుక ఉన్న అసలు రీసన్ ఇదే..!

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు అఖిల్. అయినప్పటికీ అఖిల్ నెక్స్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో ఓ సాలిడ్ బజ్ వినిపిస్తుంది.

అయితే గత కొన్ని రోజులుగా అఖిల్ మరియు ప్రశాంత్ నీల్.. సలార్ చిత్ర బృందంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు అఖిల్ సలార్ మూవీ టీం తో ఎందుకు కనిపించాడు అనేదానిపై ప్రస్తుతం ఓ క్లారిటీ వినిపిస్తుంది. కేజిఎఫ్, సలార్ మేకర్స్ అయినటువంటి నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు అలానే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా నిర్మాతగా మారి అఖిల్ తో భారీ చిత్రం తీయబోతున్నట్లు తెలుస్తుంది.

అందువల్లనే అఖిల్ సలార్ ప్రెస్ మీట్ కి హాజరయ్యాడట. అలానే ఈ సినిమాని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.