పై ఫోటోలో హ్యాండ్సమ్ లుక్ తో కనిపిస్తున్న ఈ కుర్రాడు మహేష్ బాబు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నవారు పెద్దయ్యాక కొంతమంది స్టార్ హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడుతూ ఉంటారు. అలా రీసెంట్గా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న వాడే. అయితే మరి కొంత మంది మాత్రం ఇండస్ట్రీలో నిలబడలేక ఇతర రంగాల్లో సెటిల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ పై ఫోటోలో చూస్తున్న హ్యాండ్సమ్ స్టార్ కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అయితే ఈ కుర్రాడు ఏ సినిమాలో నటించాడు.. అతని వివరాలంటే ఒకసారి చూద్దాం. మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమా లో పదేళ్ల కుర్రాడిగా నటించి మెప్పించాడు. ఈ కుర్రాడు.. టాలీవుడ్ లో ఈ సినిమాతో పాటు రెండు మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇంతకీ కుర్రాడు ఎవరో కాదు బ్రహ్మానందం కొడుకు పాత్ర చేసిన పిల్లాడు. నాన్న ట్రైన్ తెమ్మన్నాను తెచ్చావా అని బ్రమిని ఫన్నీగా అడుగుతాడు కదా ఆ బుడ్డోడు. ఈత‌ని పేరు దీపక్ సరోజ్. ఈ సినిమాల్లో హీరో ఆ ఫ్యామిలీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది బుడ్డోడే.

అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు. ఇక ఈ సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ సంపాదించుకొని పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఈ బుడ్డోడు పెద్దోడు అయిపోయి యంగ్ లుక్ లో హ‌లీవుడ్ హీరోలను తలపించే అంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇన్‌స్టా ఫోటోలతో అమ్మాయిల మనసులు దోచేస్తున్నాడు. ఇక ప్రస్తుతం హీరోగా తన అదృష్టాన్ని చెక్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు దీపక్ సరోజ్. డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో రాబోతున్న సిద్ధార్థ రాయ్‌ సినిమాలో నటించబోతున్నాడు.