“గుంటూరు కారం”లో కరివేపాకు అయిన క్యాండిడేట్ ఎవరో తెలుసా..? బాగా నమిలి ఊసేసారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్ . చిత్ర బృందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్లో పాల్గొని ఫంక్షన్ ని బాగా గ్రాండ్గా సక్సెస్ చేశారు .

అయితే గుంటూరు కారం ఈవెంట్లో అందరూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి . ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్ పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అయితే సినిమా ఈవెంట్లో మాత్రం మీనాక్షి చౌదరి బిస్కెట్ అయిపోయింది . ఎలా అంటే కూరలో కరివేపాకు లా మారిపోయింది. గ్రూప్ ఫోటోకి తప్పిస్తే అమ్మడు గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. అసలు ఈ మూవీలో ఆమె హీరోయిన్ నా..? లేకపోతే ఒక గెస్ట్ అపీరియన్స్ నా..? అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ ఇస్తున్నారు .

పాపం మీనాక్షి చౌదరి ఎంత పేరు సంపాదించుకుంటున్నా కానీ గుంటూరు కారం సినిమా విషయంలో కూరలో కరివేపాకులా పక్కన పడేశారు అంటున్నారు అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. కనీసం సినిమా రిలీజ్ అయిన తరువాత అయినా సరే ఆమె పేరు పాపులారిటీ దక్కించుకుంటుంది ఏమో చూద్ద్దాం. ప్రజెంట్ ఈ సినిమా అయితే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!