“ఆమె నా లైఫ్ లో మోస్ట్ స్పెషల్”.. మన సిద్ధు ఇంత రొమాంటిక్ ఫెలో నా..? వెరీ నాటీ..!!

సిద్ధార్థ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మల్టీ టాలెంటెడ్ హీరో.. బాయ్స్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా- బొమ్మరిల్లు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి తన క్రేజ్ ను అమాంతం పెంచుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా హీరో సిద్ధార్ధ్ ప్రెసెంట్ హీరోయిన్ అదితి రావు తో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి తగ్గట్టే వీళ్లు తరచూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

అంతేకాదు రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటో కూడా బాగా ట్రెండ్ అయింది. అప్పుడు హీరో సిద్దూ ఇంత రొమాంటిక్ ఫెలోనా ..?? అంటూ జనాలు నాటి కామెంట్స్ చేశారు . కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దుకి తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన హీరోయిన్ జెనీలియా పేరు చెప్పారు. అంతేకాదు “హహ హాసిని నా లైఫ్ లో మోస్ట్ స్పెషలని.. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీస్ -స్క్రీన్ స్పేస్ -డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా కుదిరాయని ..తను నా లైఫ్ లో మర్చిపోలేని హీరోయిన్ అని చెప్పకు వచ్చాడు”.

 

దీంతో బొమ్మరిల్లు హ్య్స్ష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ హీరో సిద్ధు చేతికి వచ్చిన పాత్రలని చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు ఆయన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. హీరోయిన్ అతిధి ని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయ్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???