జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Astrologer Venu swamy Latest News in Telugu, Astrologer Venu swamy News,  Astrologer Venu swamy Online News Live, Astrologer Venu swamy Updates |  HITTV Telugu

ఇక తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ రిలీజ్ అయి 24 గంటల్లోనే 50+ మిలియన్ వ్యూస్ సాధించి రికార్డును క్రియేట్ చేశాయి. కాగా గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వచ్చే 20 ఏళ్ళు ఇండస్ట్రీని ఏలతాడని.. రాజభోగం పట్టబోతుంది అంటూ కామెంట్లు చేశాడు. ఆయన ఈ 20 ఏళ్లలో ఏ సినిమా చేసిన కచ్చితంగా సంచలనంగా మారుతుందని చెప్పుకొచ్చాడు.

ఇకపై ఎన్టీఆర్ సినిమాలన్నీ : Astrologer Venu Swamy About Jr NTR Horoscope |  Devara Glimpse - YouTube

రాజకీయ జీవితంలో కూడా తాత జాతకమే ఆయనకు వచ్చిందని పొలిటికల్ గా కూడా రానిస్తాడంటూ వివరించాడు. అయితే ఆయన జాతకంలో దోషం ఉందంటూ చెప్పిన వేణు స్వామి అదోషం ఏంటనేది మాత్రం బయటకు చెప్పలేదు. ఇక వేణు స్వామి చెప్పిన‌ట్లే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర నుంచి రిలీజైన చిన్న గ్లింప్సే అతి తక్కువ సమయంలోనే మైండ్ బ్లోయింగ్ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ సినీ కెరీర్ లో వేణు స్వామి చెప్పినట్లుగానే అంతా నిజమవుతుంది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.