అమ్మ దీనమ్మ.. మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ప్రమోషన్స్ ఆఖరికి ఆ ప్యాకెట్లపై కూడా వదలడం లేదేంట్రా బాబు(వీడియో)

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇక ఈ సందర్భంగానే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. సాధారణంగా ప్రస్తుత కాలంలో తమ అభిమాన హీరోల సినిమాలని ప్రమోట్ చేసేందుకు పలువురు పలు రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన చిత్ర బృందం సైతం తమ మూవీని ప్రమోట్ చేసేందుకు పలు యాడ్లలో పలు సెలబ్రిటీలతో చెప్పించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక గుంటూరు కారం మూవీని ఏ విధంగా ప్రమోట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు. ఒక లేస్ ప్యాకెట్ పై మహేష్ గుంటూరు కారం మూవీ పోస్టర్ని ప్రింట్ చేపించి అమ్ముతున్నారు. ఓ యువకుడు ఈ ప్యాకెట్ ని కొని వీడియో చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.