” దర్శకుడు 100% ఎఫెక్ట్ కోరితే ఆ స్టార్ హీరో 200% ఎఫర్ట్ ఇస్తాడు “.. త్రివిక్రమ్ సెన్సేషనల్ కామెంట్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, బ్రహ్మానందం, రఘు బాబు, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

ఇక నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరు లోని నంబూరు క్రాస్ రోడ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ..” కొన్ని ఏళ్లుగా షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా నా గుంటూరు వారిని కలుసుకునేందుకు మహేష్ గారు ఇక్కడికి వచ్చారు.

దివంగత లెజెండ్రీ సూపర్ స్టార్ నట శేఖర కృష్ణ గారితో కలిసి నా సినిమా చేయలేనప్పటికీ.. మహేష్ గారితో అతడు, ఖలేజా సినిమాల సమయంలో ఆయనని కలిసి పలు గొప్ప విషయాలు నేర్చుకున్న. ఇక మహేష్ గారి విషయానికి వస్తే… అప్పట్లో అతడు టైంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఒక దర్శకుడు 100% తన నుంచి అవుట్ పుట్ ఆశిస్తే వారికి 200% ఇచ్చే ఏకైక నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ చూసి మెచ్చుకుంటారు ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.