సంక్రాంతి సినిమాల వార్.. ఫిలిం ఛాంబర్ లో కీలక నిర్ణయం..

టాలీవుడ్ ఇండస్ట్రీల సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలో రిలీజ్ అయ్యి వారి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఇక ఈసారి మరింత గట్టి పోటీ జరగనుంది. ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏది చూడాలని డెసిషన్ ప్రేక్షకుల తీసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో సోషల్ మీడియాలో గట్టిగానే హంగామా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నిర్మాతలు కావాలనే వేరే సినిమాలను తొక్కేస్తున్నారంటూ చర్చ నడుస్తోంది.

Sankranthi row: Industry bodies issue a warning to Tollywood media

దీంతో ఇక లాభం లేదనుకున్న ఫిలిం ఛాంబర్ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ గొడవపై వారు స్పందిస్తూ ఓ కీలకమైన అనౌన్స్మెంట్లు చేశారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు థియేటర్ల వివాదాలపై తెలుగు సినిమాలకు సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితమే మీటింగ్ ఏర్పాటు చేశాయని.. పండగ బ‌రిలో ఉన్న ఐదు సినిమాల నిర్మాతలతో గ్రౌండ్ రియాలిటీని వివరించి సహకరించమని కోరుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా గట్టిగానే పోటీ ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయని ఫిలిం ఛాంబర్ వినతిని మన్నించి.. రవితేజ ఈగిల్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9 కి మార్చుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

Telugu Film Chamber Urges Against Misleading Media Practices

సంక్రాంతి అంటే సినిమాల మధ్య మంచి పోటీ వాతావరణం ఉండాలి.. తెలుగు సినిమాకు సంబంధించి మా మూడు సంస్థలు కలిపి హీరోకి, ప్రొడ్యూసర్‌కి, దర్శకుడికి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం. వారి మధ్యన ఎటువంటి విభేదాలు లేవు.. కొన్ని సైట్ల వాళ్లు ఫ్యాన్స్, హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య విభేదాలు వచ్చేలా వార్తలు క్రియేట్ చేస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని కోరుతున్నాం. ఇకనుంచి సోషల్ మీడియాలో, ఇతర మీడియాలో తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు తప్పుడు వార్తలు ప్రచురిస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తూ నోటీసులు విడుదల చేశారు.