” గుంటూరు కారం ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్.. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు (వీడియో)

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ స్టార్ సినిమా ఈవెంట్ ని వీక్షించడం కోసం జనాలు రెండు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. ఇక ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. సుమారు 15 వేల మందికి పైగా జనాలు అక్కడికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇంతమందిని కంట్రోల్ చేయలేకపోవడం కారణంగా అక్కడ తొక్కిసిలాట నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలు సైతం అయ్యాయి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇలా జరగడంపై తీవ్ర ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.