” ఇక మీరే నాకు అమ్మ, నాన్న “… ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మహేష్ బాబు..!

తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశారు. అభిమానుల కేరింతల మధ్య ఉత్సాహంగా స్వీచ్ ప్రారంభించిన మహేష్.. ఈ సందర్భంగా తన తండ్రి, దివంగత నటుడు కృష్ణ ను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

 

సంక్రాంతి మా ఫ్యామిలీకి కలిసి వచ్చే పండగని.. ఈ ఫెస్టివల్ కు మా సినిమాలు విడుదల చేస్తే పక్కా హిట్ అవుతాయని అన్నారు మహేష్. ” సంక్రాంతికి నా సినిమా విజయం సాధిస్తే.. నాన్న నాకు ఫోన్ చేసి మూవీ కలెక్షన్లు, బ్రేక్ చేసిన రికార్డుల గురించి చెబుతుంటే ఎంతో హ్యాపీగా ఉండేది.

దీంతో ప్రతి సంక్రాంతికి నా సినిమా విడుదల అయ్యాక నాన్న ఫోన్ కోసం వెయిట్ చేసేవాడిని.. కానీ ఈసారి నాన్న మన మధ్యలో లేరు. ఇకనుంచి మీరే నాకు సినిమా గురించి అన్ని చెప్పాలి. ఇకపై మీరే నా అమ్మ, నాన్న ” అంటూ ఎమోషనల్ అయ్యాడు మహేష్. ప్రస్తుతం మహేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు ఆయన అభిమానులు.