57 మిలియన్ న్యూస్ తో దూసుకుపోతున్న ” దేవర ” గ్లింప్స్… ఎన్టీఆరా మజాకానా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. ఈ సినిమాపై తారక్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం తారక్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి నిన్న మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ ను తెలుగు భాషతో పాటుగా ఇతర భారతీయ ప్రధాన భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ఈ గ్లింప్స్ వీడియో కి నేషనల్ రెస్పాన్స్ వచ్చింది కూడా. ఈ గ్లింప్స్ వీడియో ఇప్పటివరకు 57 మిలియన్స్ కి పైగా న్యూస్ ను రాబట్టడం జరిగింది. ప్రస్తుతం గ్లింప్స్ వీడియో యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.