సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నాగ్ ” నా సామిరంగ “.. పండగ చేసుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను నిన్న విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్లో విడుదల కావడానికి ఐదు రోజుల ముందే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ విలేజ్ యాక్షన్ డ్రామా కి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మూవీ యొక్క ఆమోదించబడిన రన్ టైం 146 నిమిషాలు. ఈ సినిమాలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీనివాస చిట్లూరి ఈ సినిమాని నిర్మిస్తుండగా ఈ మూవీపై నాగార్జున అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమాతో మరో మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. మరి వాటిని పక్కకి నెట్టి నా సామిరంగా మూవీ ముందుకు వస్తుందో లేదో చూడాలి మరి.