నాని ” హాయ్ నాన్న ” మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన ” దేవర ” బ్యూటీ..!

టాలీవుడ్ యువ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ” హాయ్ నాన్న “. వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థపై గ్రాండ్గా నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

జయరాం, నాజర్, శృతిహాసన్, ప్రియదర్మ, అంగద్ బేడి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. ఇక ఈ మూవీపై ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దేవర హీరోయిన్ జాన్వి కపూర్ తన ఇన్స్టా వేదికగా హాయ్ నాన్న మూవీ చూసి పొగడ్తలు కురిపించింది.

హాయ్ నాన్న మూవీ తన మనసుని తాకిందని.. దర్శకుడు శౌర్యువ్ టేకింగ్ బాగుందని.. హీరోయిన్ మృణాల్ ఎంతో ఆకట్టుకున్నారని.. అలానే మరోసారి హీరో నాని తన అద్భుత పర్ఫామెన్స్ తో అలరించారని టీం కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది జాన్వి. ప్రస్తుతం జాన్వి కపూర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.