ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పిన జోష్యమే నిజమవుతుందా.. ఫ్యాన్స్‌లో మొద‌లేన టెన్స‌న్‌.. కార‌ణం ఇదే..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సినిమా కోర్ టిమ్‌ అందరు కలిసి కేక్ కట్ చేసుకుని మరి సందడిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొంతమంది అభిమానులకు మాత్రం ఓ విషయం క్లియర్ గా అర్థమైంది. ప్రభాస్ చేయి నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా ఆ ఫోటోలలో కనిపించాడు. ప్రభాస్‌కి ఏమైంది అనే ప్రశ్నలు రైస్ చేస్తున్నారు.

Prabhas Prithviraj Sukumaran and Team Salaar are all smiles at success party - India Today

సాధారణంగా ఎవరు ఆ ఫోటోలు చూసినా అదే డౌట్ వస్తుంది. ఇక డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా రూ.650 కోట్లకు పైకి క్రాస్ వసూళ్లు రావడంతో ఏడాదికి చక్కటి ముగింపు నిచ్చింది. దీంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇటీవల నిర్వహించారు. ఇందులో ప్రభాస్ చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. దీంతో గతంలో వేణు స్వామి ప్ర‌భాస్ ఫ్యూచ‌ర్‌లో ప‌లు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ జ్యోతిష్యం చెప్పాడు.

Astrologer Venu Swamy : ఫలించిన వేణు స్వామి పూజలు.. బంఫర్ ఆఫర్!

అదేవిధంగా ప్రభాస్ గతంలో తన మోకాలు నొప్పితో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. సర్జరీ కూడా చేయించుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఆది పురుష్‌ ప్రమోషన్స్ సమయంలో కూడా ఎవరో ఒకరి సహాయంతో స్టేజి పైకి వచ్చిన పిక్స్ వైర‌ల్ అయ్యాయి. సరే ఇప్పుడు కాస్త సెట్ అయింది అనుకునే లోపు.. సలార్ సెల‌బ్రేషన్స్‌లో చేయి పట్టుకొని కనిపించాడు. చేతికి ఏదో ఇబ్బంది ఉన్నట్లుగా ఆ ఫొటోస్ లో కనిపించింది. దీంతో వేణు స్వామి చెప్పిన జోష్యమే ప్రభాస్ విషయంలో నిజమవుతుందేమో అన్న భయం ప్రభాస్ ఫ్యాన్స్‌లో మొదలైంది.