ప్రభాస్ – మారుతి సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పై క్లారిటీ వచ్చేసిందోచ్.. ఇక ఒక్కొక్కడికి ఊచకోతేగా..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గానే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డ్ నెలకొల్పాడు. ఇక తన నెక్స్ట్ మూవీ కల్కి 2898AD రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఏడాది రిలీజ్ కి రెడీ చేస్తున్న సినిమాలలో మరొకటి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ఒకటి.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ను ఈ సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారట మేకర్స్. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందట. అయితే ఎలాంటి గ్లింప్స్ వీడియో రిలీజ్ అయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తుంది. ఏదైనా ఈ సినిమాని ఈ ఏడాది చిత్రాలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.