శంకర్ ‘ గేమ్ చేంజర్ ‘ లో ఆ సీన్స్ నేనే డైరెక్ట్ చేశా.. సైంధవ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మెగా పవ‌ర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మూవీ.. గేమ్ చేంజ‌ర్‌. ఈ సినిమా హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలోకి వెళ్లిందని గత ఏడాది జులై టైంలో జోరుగా ప్రచారం జరిగింది. శంకర అప్పుడు ఇండియన్ 2 హడావిడిలో ఉండడంతో.. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆ ప్రాజెక్టును శైలేష్ కొల‌ను హ్యాండోవర్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్స్ లో జాయిన్ కావడంతో వాటికి చెక్ పెట్టినట్లు అయింది. అయితే నిజంగానే ఈ సినిమాలో కొన్ని సీన్స్ కి హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడట.

The Involvement of a Hit Director in RC's Gamechanger

ఆ విషయాన్ని ఇటీవల త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెంకటేష్ సైంధ‌వ్‌ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో వివరించాడు. గేమ్ చేంజర్ కోసం నేను తీసిన షార్ట్స్, బీ రోల్ షాట్స్‌, ఎస్టాబ్లిషింగ్ షాట్స్, పాసింగ్ షాట్స్ అంటూ చెప్పుకొచ్చాడు. మామూలుగా మేమైతే అసిస్టెంట్ డైరెక్టర్‌తో తీయించేస్తాం. కానీ శంకర్ మామూలుగానే ఆయన తీస్తారు. కానీ లొకేషన్ ఇబ్బందుల వలన నేను తీయాల్సి వచ్చింది అంటూ వివరించాడు. గేమ్ చేంజర్ సినిమా కోసం షూటింగ్ లోకేషన్ ని ముందుగానే బుక్ చేశారని.. అయితే ఆ టైం కు శంకర్ వేరేచోట అదే సినిమాను షూట్ చేయాల్సి రావడంతో.. అందుబాటులో లేరని వివ‌రించాడు.

Saindhav Movie Trailer, Star Cast, Release Date, Box Office, Movie Review |  Saindhav Movie budget and Collection | Saindhav | Indian Film History

ఆ ఎస్టాబ్లిషింగ్‌ షాట్స్ నేను డైరెక్ట్ చేశానని లొకేషన్ కి ఆల్రెడీ డబ్బు కట్టడం వల్ల ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే తీయించండి అని శంకర్ చెప్పడంతో దిల్ రాజు తనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. రెండు రోజులు ఒక లొకేషన్‌లో షూట్ చేశామని వివరించాడు శైలేష్ కొల‌ను. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్వహిస్తున్న గేమ్‌ చేంజర్‌ సినిమా రామ్ చరణ్ శర‌సన కియారా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇటీవల వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సైంధవ్‌ మూవీని శైలేష్ కొల‌న్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు రానుంది.