కత్తి లాంటి ఫిగర్లు ఉన్న మన అందాల ముద్దుగుమ్మలు..ఏం చదువుకున్నారో తెలిస్తే స్టన్ అయిపోతారు..!!

చాలామంది అంటుంటారు చదువు అబ్బకపోతేనే సినిమాలోకి వస్తూ ఉంటారు అని ..కానీ అది అబద్దం చదువుకి సినిమాలకి ఏ మాత్రం సంబంధం లేదు. ఎవరి ఫ్యాషన్ వాళ్ళదే ..ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే ..బాగా చదువుకున్న నటీనటులు కూడా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎదిగి సూపర్ సక్సెస్ అందుకున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సమంత : చదువుల్లో సరస్వతి .. చిన్నప్పటి నుంచి సమంత చాలా చురుగ్గా ఉండేవారట. చెన్నైలో బీకాం పూర్తి చేసిన సమంత ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులు కారణంగా చదువు ఆపేసింది.

రష్మిక : నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఆర్ట్స్ స్టూడెంట్ ఆమె సైకాలజీ జర్నలిజం ఇంగ్లీష్ లిట్రేచర్ లో డిగ్రీ చేశారు . కిర్రాక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు .

రకుల్ ప్రీత్ సింగ్ : జీరో సైజ్ బేబీ అంటూ పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బిఎస్సి చేశారు. అంతే కాదు ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం . 2009లో విడుదలైన జల్లి మూవీతో వెండి తెరకు పరిచయమయ్యారు .

అనుష్క శెట్టి : జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి సైన్స్ లో డిగ్రీ చేశారు . ఆమె బిఎస్సీ చేయడం జరిగింది. అనుష్క యోగా ట్రైనర్ కూడా .. సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది .

కాజల్ అగర్వాల్: చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ బిఏ చేశారు. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసి హీరోయిన్గా మారారు .లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

కీర్తి సురేష్ : ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎప్పుడో తన కెరీర్ ను ప్రారంభించింది . తండ్రి సురేష్ దర్శకుడు కావడం ఆమెకు మరింత ప్లస్ గా మారింది .

పూజ హెగ్డే : స్టార్ లేడీ పూజా హెగ్డే కామర్స్ లో పీజీ పూర్తి చేసింది . కాలేజీలో పూజా కల్చరల్ ఈవెంట్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేవారు . అలా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చింది.

సాయి పల్లవి : డిగ్రీ గురించి అందరికీ తెలుసు ..ఎంబిబిఎస్ చేసినట్లు సాయి పల్లవి అనేక ఇంటర్వ్యూలో చెప్పారు . హీరోయిన్గా రిటైర్ అయితే మాత్రం కచ్చితంగా మళ్ళీ డాక్టర్ వృత్తి చేపడుతుందట .

తమన్న : మిల్కీ బ్యూటీ తమన్న ఆర్ట్స్ స్టూడెంట్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేశారు .

శృతిహాసన్ : మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ కూడా సైన్స్ స్టూడెంట్ . 36 ఏళ్ల శృతిహాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించింది .

నయనతార : సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిఏ ఇంగ్లీష్ చేశారు . 2003లో మలయాళ పరిశ్రమలో కెరియర్ ప్రారంభమైంది . ప్రజెంట్ ఇద్దరు పిల్లలతో భర్తతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!