పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయబోయేది ఎవరు తెలుసా..? నా సామీ రంగా ఈసారి షర్ట్లు చించేసి మరి అరవాల్సిందే..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరికొద్ది నెలలోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. కాగా పుష్ప వన్ తో సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన బన్నీ ఉత్తమ జాతీయ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు . దీంతో పుష్ప2 తో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు అన్న క్యూరియాసిటీ అందరికీ ఉంది . అంతేకాదు పుష్ప వన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి 30% కారణమైంది ,

హీరోయిన్ సమంత కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించి సినిమాకి మంచి ఎనర్జీ ఇచ్చింది. ఇప్పటికీ ఊ అంటావా మావ అంటూ చాలామంది ఊగిపోతూ డాన్సులు వేస్తున్నారు అంటే దానికి కారణం కచ్చితంగా సమంత అనే చెప్పాలి. ఆ తర్వాత ఈ పాటను పాడిన సింగర్ ఇంద్రావతి ..మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ అందరూ కూడా సరైన న్యాయం చేశారు . అయితే ఇప్పుడు అందరి దృష్టి పుష్ప2 పైన పడింది.

ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఎవరు చేయబోతున్నారు అన్న విషయం వైరల్ అవుతుంది . సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ ను ఏ హీరోయిన్ తో తెరకెక్కించాలి అన్న విషయం ఫైనలైజ్ చేసుకున్నాడట సుకుమార్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో దిశాపటాని ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . మొదటి నుంచి దిశా పటాని అంటే హాట్ ఐటమ్ అన్న పేరు ఉంది. ఇక అలాంటి హాట్ ఐటమ్ మన అల్లు అర్జున్ పక్కనే నటిస్తే రచ్చ రచ్చ అంటున్నారు జనాలు . ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!