అనుష్క శెట్టి కి ఘోర అవమానం.. తగిన శాస్తి జరిగింది అంటూ ఫ్యాన్స్ సపోర్ట్ .. అసలు ఏమైందంటే..?

పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు అనుష్క శెట్టికి ఇప్పుడు ఘోర అవమానం ఎదురైంది . అనుష్క శెట్టి ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు అనుష్క శెట్టి పలువురు బడా హీరో సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకొని స్టార్ హీరోయిన్గా మారింది .

ఓ పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరోపక్క ఈ జనరేషన్ కి నచ్చే రొమాంటిక్ సినిమాలు రెండిటిని సరి సమానంగా నటిస్తూ బిజీ అయిపోయిన అనుష్క శెట్టి కెరియర్ లో ఒక్కసారిగా బ్రేక్ తీసుకుంది. నిశ్శబ్దం తర్వాత దాదాపు మూడేళ్ల పాటు స్క్రీన్ పై కనిపించలేదు . ఆ తర్వాత ఆమె నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . ఈ సినిమా టాక్ ప్రకారం బాగా పాజిటివ్ కామెంట్స్ అందుకుంది. కామెడీ కూడా సినిమాలో బాగా పండింది .

నవీన్ పోలిశెట్టి పర్ఫామెన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా రీసెంట్గా జి తెలుగులో ప్రసారమైంది. ఈ సినిమాకి పరమ చెత్త టీఆర్పి రేటింగ్స్ వచ్చాయి . కేవలం 3.2 రావడం అనుష్కకు ఘోరా అవమానం అంటున్నారు జనాలు . మరొక పక్కా ఫ్యాన్స్ కూడా ఆమెకు తగిన శాస్తి జరిగింది అంటూ ఫైర్ అవుతున్నారు . అనుష్క శెట్టి కెరియర్ పరంగా బ్రేక్ తీసుకోకూడదని .. తీసుకుంటే ఇలాగే ఉంటుందని ..కంటిన్యూగా ఏదో ఒక సినిమాలు చేస్తూ ఉంటే ఆమె రేటింగ్స్ బాగా వస్తాయని సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి అనుష్క ఏం చేస్తుందో..??