“రేయ్..ఓరేయ్..తేజా అర్ధం చేసుకో..ప్లీజ్ రా”.. మహేశ్ బాబు స్పెషల్ రిక్వెస్ట్ విన్నారా..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయలోకం . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం . దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఒకప్పుడు తన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు తన సినిమాలకే కాంపిటీషన్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు హీరో అంటే కచ్చితంగా ఎదుటి ఉండే హీరోకి మండిపోతుంది . అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఈగో అహం అడ్డు అవ్స్తూ ఉంటాయి. ప్రజెంట్ అలాంటి టాప్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు మహేష్ బాబు .

ఆయన నటించిన రాజకుమారుడు యువరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ ఇప్పుడు ఆయనతో పాటు సినిమాలను రిలీజ్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు . తేజ సబ్జా నటించిన హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. అదే రోజు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రెండు సినిమాలకు సంబంధించిన మీమ్‌స్ ట్రోల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి . ఇదే క్రమంలో తేజ రెస్పాండ్ అయ్యాడు .

“మహేష్ బాబు తో నా సినిమాలకి కాంపిటీషన్ నా..? నవ్వేస్తారు ఊరుకోండి అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఆయనతో స్పెషల్ మూమెంట్ ని గుర్తు చేసుకున్నారు . ఆయనతో కలిసి చిన్నప్పుడు వర్క్ చేసే టైం లో ఆయన పేరు పలకడం రాక మహేష్ ని మగేష్ అని పిలిచే వాడినని.. అది తెలిసి మహేష్ నా దగ్గరకు వచ్చి ఓరేయ్ నీకు పిలవడం రాకపోతే అన్నా అని పిలువు ..చాలు నా పేరును ఖూనీ చేయద్దురా అర్థం చేసుకో ప్లీజ్ అంటూ నన్ను రిక్వెస్ట్ చేశాడు అని సరదాగా ఫన్నీ మూమెంట్ షేర్ చేసుకున్నాడు”. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!