బాలయ్య-బాబీ మూవీ ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగ చేసుకునే న్యూస్ ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది . కాగా సినిమాలో ఇద్దరు బడా హీరోలు ఉండడం ఒక మల్టీ స్టార్ ట్రెండ్ అయితే సినిమాలో ఒక పెద్ద స్టార్ హీరో మరొక చిన్న హీరో నటించడం సెకండ్ ట్రెండ్ గా ముందుకెళ్తుంది . రీసెంట్గా వచ్చిన నితిన్ ఎక్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో రాజశేఖర్ నటించిన పాత్ర బాగా అభిమానులను ఆకట్టుకుంది . అయితే ఇదే క్రమంలో ఆయనకు మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. రాజశేఖర్ బాలయ్య బాబు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు డైరెక్టర్ ఓ న్యూస్ లీక్ అయ్యి వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎంత హైలైట్ అవుతుందో రాజశేఖర్ పాత్ర కూడా అంతే హైలెట్ అవుతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సినిమా ణ్భ్ఖ్109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి నందమూరి నటసింహం బాలయ్య లుక్ లీక్ అయింది. ఇక అందులో బాలయ్య యంగ్ కుర్రాడిలో కనిపిస్తున్నాడు. దీంతో సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయ్. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష అలాగే ప్రియమణి నటించబోతున్నారట..!!