ఎన్టీఆర్ లో నాకు నచ్చే క్వాలిటీ అదే.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్‌ ను సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. నటనతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా సాధారణ మనిషిలా ఉంటూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకోవడంతో తన తదుపరి సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమా పనులో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అసలు విషయానికి వస్తే రాజమౌళి.. ఎన్టీఆర్ కలిసి ఇప్పటికే మూడు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచాయి. ఇక ఆర్ఆర్ఆర్‌గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. ఎన్టీఆర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇంటర్వ్యులో ఎన్టీఆర్ ను ఎంత దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా అతని గురించి ఎన్టీఆర్ లో నచ్చే అంశాన్ని గురించి చెప్పమని అడగగా.. రాజమౌళి సమాధానం చెపుతూ ఎన్టీఆర్ తో కలిసి నేను ఇన్ని సంవత్సరాల పాటు జర్నీ చేశాను. ఇక ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఆయనకు ఎన్నో ఫ్లాప్ సినిమాలను అందించినటువంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు.

కానీ ఎప్పుడు కూడా ఫలానా డైరెక్టర్ ఇలాంటి వ్యక్తి అనే విమర్శలు కానీ, వారిని దూషించడం కానీ నా దగ్గర చేయలేదు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఏ డైరెక్టర్ గురించి మనం అడిగిన ఆయన కచ్చితంగా అందరిలోనూ పాజిటివ్స్‌ చెప్తాడు. ఇలా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తిత్వం ఎన్టీఆర్లో అసలు లేదు అంటూ రాజమౌళి వివరించాడు. ఎన్టీఆర్ గురించి ఆయన మనస్తత్వం గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాకపోతే ఎన్టీఆర్ సరదాగా సంతోషంగా ఉన్న సమయంలో కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ చెడుగా మాట్లాడరని రాజమౌళి చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆనందాన్ని క‌లిగిస్తున్నాయి.