” హనుమాన్ ” మూవీలో ఆ ఒక్క షూట్ కోసం తేజాని ప్రశాంత్ ఏకంగా రెండేళ్లు కష్టపెట్టాడా.. ఏంటి బాసు ఇది..!

ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడనున్న తేజ మనందరికీ సుపరిచితమే. ఇక ఈ సంక్రాంతి బరిలో దిగనున్న నాలుగు సినిమాలలో ” హనుమాన్ ” సినిమా ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోలవే అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా తమ కథపై నమ్మకం పెట్టి హనుమాన్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ఇక ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కక పోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇక తాజాగా ట్రైలర్ చివర్లో ఉన్న హనుమంతుడి కళ్ల షాట్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..” ఆ షాట్ ని అలా తీయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.

అంటే ఆ సీక్వెల్స్ మొత్తానికి అంత సమయం పట్టింది. ఒక షాట్ తరువాత ఒక షాట్ చెయ్యము కదా. అన్ని ఒకేసారి చేసుకుంటూ వచ్చాం. వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఆ షాట్ చూసుకున్నప్పుడు మాకు కూడా మంచి అనుభూతి కలిగించింది ” అంటూ ఆ సీన్ వెనుక ఉన్న కష్టాన్ని బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.