యుఎస్ ప్రీ సేల్స్ లో దుమ్ము రేపుతున్న ” గుంటూరు కారం “.. మహేషా మజాకానా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. అలాగే శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, బ్రహ్మానందం, సునీల్, హైపర్ ఆది కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అలాగే థమన్ సంగీతమందిస్తున్న ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ప్రస్తుతం యుఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో ఈ సినిమా దుమ్ము రేపుతుంది.

ఇప్పటికే అక్కడ రికార్డ్ స్థాయిలో ఎన్నో లొకేషన్స్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ తాజాగా ప్రీ సేల్స్ పరంగా 500కె డాలర్స్ సొంతం చేసుకున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యంగిరా మూవీస్ వారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే ఇంకా చాలా ఏరియాలలో బుకింగ్స్ ఓపెన్ కాలేదని, మంగళవారం వాటిని ఓపెన్ చేస్తున్నట్లు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా వెల్లడించారు. ఇక ఇప్పుడే ఈ రేంజ్ రికార్డ్ ని నెలకొల్పిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఇంకే రికార్డుని సృష్టిస్తుందో చూడాలి మరి.