” నా సామిరంగా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది “.. డైరెక్టర్ విజయ్ బిన్నీ సెన్సేషనల్ కామెంట్స్..!

కింగ్ నాగార్జున హీరోగా.. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చుట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పై నాగార్జున అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా గురించి విజయ్ బిన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ..” ఈ సినిమాలో నటించేందుకు నాగార్జున గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మాకు సంగీతం అందించిన నేషనల్ అవార్డు విన్నర్ ఎం ఎం కీరవాణి గారు కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా సినిమా షూటింగ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగింది.

అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళిద్దరూ కథలో జీవించారు. ఇక ఇందుకు నాగార్జునా గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎంతోమంది మంచి డైరెక్టర్లతో పని చేశారు. ఇక ఆయనతో నాకు పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఈనెల 14న మా సినిమా మీ అందరిని తప్పకుండా అలరిస్తుంది. మర్చిపోకుండా మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్‌ బిన్నీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.