బుక్ మై షోలో మహేష్ ని తలదన్ని టాప్ వన్ గా నిలిచిన.. తేజ ” హనుమాన్ ” మూవీ..!

2024 సంక్రాంతి బారిలో దాదాపు 5 సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక ఈ రేస్ నుంచి ఇప్పటికే రవితేజ ” ఈగిల్ ” మూవీ తప్పుకోగా.. ఇంకా ఈ పండగ బరిలో మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్, తేజ హనుమాన్ సినిమాలు పోటీ పడనున్నాయి.

ఇక ఈ నాలుగు సినిమాలపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. బుక్ మై షోలో యంగ్ హీరో తేజ ” హనుమాన్ ” దూసుకుపోతుంది. ఈ మూవీకు 187K టికెట్స్ బుక్ కాగా.. మహేష్ ” గుంటూరు కారం ” సినిమాకి 186K మాత్రమే బుక్ అయ్యాయి. బుక్ మై షో లో మహేష్ ని తలదన్ని హనుమాన్ మూవీ దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by battubabai (@battubabai)