ఈ ఫోటోలో ఉన్న చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

సినీ సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అదేవిధంగా వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంటుంది. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు బాల్యం సంబంధించిన జ్ఞాపకాలు ఇలా వారి చిన్నప్పటి ఫోటోలను చూడడానికి కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక గత కొంతకాలంగా త్రో బ్యాక్‌థీమ్ తో సినీ సెలెబ్రిటీస్‌కు సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. వారి చిన్ననాటి ఫోటోలను చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా ఫ్యాన్స్‌కు త‌మ‌ అభిమాన హీరో హీరోయిన్ల చిన్నానాటి ఫోటోలను చూడాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరో హీరోయిన్లు రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వి క‌పూర్‌,, కీర్తి సురేష్, పూజ హెగ్డే, సమంత లాంటి స్టార్ హీరోల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో హీరోయిన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తాజాగా ఇటీవ‌ల‌ బాలయ్య నటించిన టాలీవుడ్ సినిమాలో ఈమె నటించి కుర్ర కారును ఓ ఊపు ఊపింది.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు కేరళకు చెందిన స్టార్ బ్యూటీ హ‌నీ రోజ్‌. మలయాళ డైరెక్టర్ వినయ్ నేరా దర్శకత్వం వహించిన బాయ్ ఫ్రెండ్ సినిమాతో పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2008లో వచ్చిన ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్గా మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్ కు హాట్ ట్రిట్ ఇస్తుంది. ప్రస్తుతం హనీ రోజ్‌ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక తాజాగా హాని రోజ్‌ చిన్ననాటి ఫొటోస్ బాగా వైరల్‌గా మారాయి.