“కడుపులోనే నా బిడ్డ చనిపోయింది”..జబర్ధస్త్ అవినాష్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

రీసెంట్గా.. ముక్కు అవినాష్ తన అభిమానులకు బాడ్ న్యూస్ వినిపించాడు . జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ .. ముక్కు అవినాష్ గా బాగా ప్రసిద్ధి చెందాడు . కేవలం జబర్దస్త్ లో కూడా పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ 2021 లో అనుజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్గా 2023 ఏప్రిల్ లో ఆయన తన భార్య గర్భవతి అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు .

అంతేకాదు వీళ్ళకి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ , శ్రీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. త్వరలోనే పండు లాంటి పాపను కానీ బాబును కానీ తీసుకోబోతున్నారు అని జనాలు ఆశపడేలోపే అవినాష్ బ్యాడ్ న్యూస్ వినిపించాడు. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఆయన తన బిడ్డను కోల్పోయిన విషయాన్ని అఫీషియల్ గా ధ్రువీకరించారు. ముక్కు అవినాష్ తన పోస్టులో రాసుకోస్తూ ..

“ఇప్పటివరకు నా లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్లను మీరు విన్నారు. ఇప్పుడు నా జీవితంలో జరిగిన విషాదాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను నా బిడ్డను కోల్పోయాను . అమ్మానాన్నలు అవ్వాలని ఎంతో ఆశగా ఎదురు చూసాం . కానీ మా జీవితంలో ఊహించినది జరిగింది. కొన్ని కారణాల చేత కడుపులో బిడ్డ చనిపోయింది. ఇది నేను ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. దయచేసి ఈ కష్ట సమయంలో మాకు తోడుగా నిలుస్తారు అని ఆశిస్తున్నాము . ఇక దీనిపై ఎటువంటి ప్రశ్నలు వేసి విసిగించొద్దు.. ప్లీజ్ అర్థం చేసుకోండి “అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అందరూ అనూజా అవినాష్ లకు సపోర్ట్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)