” ఆ స్టార్ హీరోయిన్ రేంజ్ లో నాకు పాపులారిటీ రాలేదు “.. రిపోర్టర్ ప్రశ్నలకు సీరియస్ అయిన అంజలి.!

హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” ఫోటో ” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ” ప్రేమలేఖ రాశా” అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఈమె నటించిన ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో కోలీవుడ్ కి మకాం మార్చింది ఈ బ్యూటీ. ఇక ఈ క్రమంలో షాపింగ్ మాల్, జర్నీ వంటి సినిమాలు ఆమెకి బ్రేక్ ఇచ్చాయి. ఇక దీంతో తెలుగులో ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ” అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ సినిమా సక్సెస్ అవడంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక 2014లో ఈమె ప్రధాన పాత్రలో నటించిన ” గీతాంజలి ” సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ” గీతాంజలి మళ్లీ వచ్చింది ” అనే టైటిల్ తో ఈ సీక్వెల్ రూపొందునుంది. ఇక ఈ సినిమాకి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈరోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ లంచ్ ఈవెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో ” క్యూ అండ్ ఏ ” ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ క్రమంలో ఓ లేడీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు అంజలికి చాలా కోపం తెప్పించాయి.

” మీకు నేను పెద్ద అభిమానిని. మీరు తెలుగమ్మాయి అవ్వడం వల్లే ఇంకా సరైన బ్రేక్ రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? అని ఓ రిపోర్టర్ అంజలీని ప్రశ్నించగా.. దానికి అంజలి సమాధానం ఇస్తూ..” నాకు బ్రేక్ రాకపోతే మీరు నా అభిమాని ఎలా అవుతారు. నేను తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాను ” అంటూ సీరియస్ అయ్యింది. ఇక అనంతరం ఆ రిపోర్టర్.. శ్రీ లీల కూడా తెలుగమ్మాయి. మరి ఆమె రేంజ్ లో మీకు సక్సెస్ రాలేదు కదా.. అంటూ అంజలీకి మరింత చిరాకు తెప్పించింది. దానికి అంజలి బదులిస్తూ..” నేను ఇప్పటికీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఆ నెంబర్ గేమ్స్ ని నేను పట్టించుకోను. నాకు నచ్చిన పాత్రలే చేస్తాను ” అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.