“ఆ కంపు వాటికి దూరంగా ఉంటేనే బెటర్”.. అనసూయ కౌంటర్ ఎవరికో అర్ధమైందిగా బ్రదర్స్..!

అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ కమ్ నటి. ప్రజెంట్ పలు సినిమాలలో లీడ్ పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ క్రేజీ స్థానాన్ని దక్కించుకున్న అనసూయ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది.

ఈ క్రమంలోని ఒక నెటిజన్ ” మీ లాగ స్ట్రాంగ్ గా 2024 లో ఉండాలి అంటే ఏం చేయాలి అంటూ ప్రశ్నించారు ..?”. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ ..”మనం ఈ ఏడాదిలో చాలా కూల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మూడు విషయాల గుర్తుపెట్టుకోవాలి ..”మనశ్శాంతి కోసం ఎక్కువగా వెతికాను ..2023లో అదే నేర్చుకున్నాను ..అలాగే నా ఆరోగ్యం గురించి కూడా కేర్ తీసుకున్నాను ..ఇంకొకటి కొన్ని విషయాలకు దూరంగా ఉన్నాను “అంటూ చెప్పుకొచ్చింది.

“అంతేకాదు మరొక నెటిజన్ మీ పై ట్రోల్ చేసే వాళ్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు..? అని అడగ్గా..” అనసూయ సమాధానమిస్తూ ..”అసలు ట్రోలర్స్ అంటేనే వింత రకమైన జీవులు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఆ కంపు నాకు అంటదు కదా ..సో వాటికి నేను ఏం చెప్పి టైం వేస్ట్ చేసుకోను “అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. దీనితో సోషల్ మీడియాలో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!