అలాంటి పనులు చేస్తే బబుల్ గమ్ హిట్ అవుతుందా.. కొడుకు కోసం మరీ అంత దిగజారాలా..

టాలీవుడ్ టాప్ ఫిమేల్ యాంకర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. ఇక తాజాగా సుమా కొడుకు రోషన్ కన‌కాలను ఓ మూవీ తో టాలీవుడ్‌కి పరిచయం చేసిన‌ సంగతి తెలిసిందే. డిసెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్‌ టాప్ ను సొంతం చేసుకుంది. రోషన్ యాక్టింగ్ ఓకే, కానీ కథ ప్రేక్షకుల్లో అంతగా రీచ్ కాలేదు. రెండు వారాలు కావొస్తున్న సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. బటుల్ గ‌మ్ ప్లాప్ ఖాతాలో చేరినట్లే.. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా సుమా మాత్రం కొడుకు సినిమాను హిట్ చేయాలని జనాల్లోకి పబ్లిసిటీ తీసుకువెళ్లాలని.. ఎన్నో పబ్లిసిటీ స్టాంట్‌లు చేస్తూనే ఉంది.

సినిమాను లిఫ్ట్ చేయాలని కష్టపడుతూనే ఉంది. తాజాగా బబుల్ గ‌మ్‌ టైటిల్ తో కూడిన ఔ అవుట్ ఫిట్‌ ధరించి గ్రామర్ షో చేసింది. బిగ్ హోల్స్ నెట్ టీ షర్ట్ ధరించిన సుమ ట్రెండి ఫోటో షూట్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టూ గ్లామరస్ ఫోటోషూట్ చేసి కొడుకు సినిమా హిట్ అవడం కోసం తెగ ప్రయత్నించింది. అయితే ప్రస్తుతం సుమ ఎంత ట్రై చేసినా సినిమా అయితే భారీ వసూళ్లను దక్కించుకోవడం చాలా కష్టం. ఏదో అరకొర కలెక్షన్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది.

కానీ కొడుకు భవిష్యత్తు గురించి సుమ ఇలాంటి దారుణ ఫోటో షూట్ చేస్తూ అనవసరంగా ట్రోల్స్‌కు గురవుతుంది. ఇక ఈ సినిమాకు నిర్మాత కూడా సుమానే అని సమాచారం. కాగా ప్రస్తుతం సుమ మరి ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్ చేయడంతో నిన్న మొన్నటి వరకు ఎంతో సాంప్రదాయంగా ఉన్నా నీకు.. కొడుకు సినిమా కోసం ఇలాంటి స్టంట్లు అవసరమా.. ఇలాంటి బట్టలు వేసుకుని ఎక్స్పోజ్ చేస్తే సినిమా హిట్ అవుతుందా అంటూ నెట్టిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు.