సర్జరీ చేయించుకున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఆందోళనలో ఫ్యాన్స్..

బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న బుల్లితెర నటి ప్రియాంక జైన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మౌనరాగం, జానకి కలగడం లేదు ఇలా బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోయిన్గా నటించి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 15 వారాలు పాటు కానసాగి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమె తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ఎన్నో వీడియోలను షేర్ చేసింది.

వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రశ్నకు కూడా ఈ ఏడాదిలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ సమాధానం చెప్పింది. ఇకపోతే వీరి యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా ఓ వీడియోని షేర్ చేసుకున్నారు. ఇందులో శివకుమార్ మాట్లాడుతూ ప్రియాంక సర్జరీ రూమ్ లో ఉందని.. ఆమె సర్జరీ చేయించుకుంటే తనకు టెన్షన్ గా ఉందంటూ వివరించాడు. తన కళ్లకు సర్జరీ జరుగుతుందని గత కొద్ది రోజులుగా ఆమె సైట్ కారణంగా ఇబ్బంది పడుతుందని వివరించాడు. తన సెవెంత్ క్లాస్ నుంచి సైట్ ఉందని అయితే ఇప్పుడు కాస్త ఎక్కువ కావడంతో లెన్సెస్ వాడుతుందని వివ‌రించాడు.

అయితే ఇప్పుడు చేయించుకునే సర్జరీతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించాడు. అయితే ప్రియాంక జెన్ సర్జరీ చేయించుకుంటున్న వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఆమె సర్జరీ ఏమైంది.. ఇప్పుడు ఆమె ఎలాఉంది అంటూ పలు ప్రశ్నలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ఇక శివకుమార్, ప్రియాంక జైన్ కలిసి మౌనరాగం సీరియల్ లో నటించారు. ఈ స‌మ‌యంలో ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డి ఇప్ప‌టికి అదే రిలేష‌న్ మెయింటైన్ చేస్తున్నారు.