నాన్న నుంచే నేను అవి నేర్చుకున్న.. ఆయన అలా చేయడం ఎప్పటికీ మర్చిపోలేను మహేష్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తిచేసుకుని ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు కారం ప్రమోషన్‌ల‌లో భాగంగా మహేష్ బాబు తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను, సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌హేష్‌ మొదట్లో నా సినిమాలు పెద్దగా ఆడేవి కావని.. కృష్ణ గారి అబ్బాయి అనే పేరు ఒత్తిడి నాపై ఉండేదంటూ చెప్పుకొచ్చాడు. రెమ్యున‌రేష‌న్‌ గురించి ఆలోచించకుండా సినిమాల్లో ఓకే చేశానని వివరించాడు.

ఒక్కడు సినిమా తర్వాత ధైర్యం వచ్చిందని. అదే టైంలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది అన్న మహేష్ నేను నా సర్కిల్లో పూర్తిగా వేరుగా ఉంటానని.. నవ్వుతూ, కబుర్లు చెబుతూ సరదాగా గడుపుతానని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఫ్రీగా తిరగలేను కాబట్టే షూటింగ్స్ లేకపోతే విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తానని వివరించిన మహేష్.. విదేశాలకు వెళ్లి వస్తే నేను రీచార్జ్ చేసుకున్నట్లుగా ఫీల్ అవుతానని వివరించాడు. నాన్నగారిని చూస్తూ పెరగడం వల్ల నాలో క్రమశిక్షణ పెరిగిందని.. ఆ క్రమశిక్షణ నాకు బలం అంటూ వివరించాడు.

ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా నవ్వుతూ ఉండడమే నా గ్లామర్ సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చిన మహేష్.. మురారి మూవీ రిలీజ్ టైం లో నాన్నతో కలిసి సుదర్శన్ థియేటర్‌కి వెళ్లానని వివరించాడు. ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా వస్తుందో అని నేను చాలా భయపడుతున్నానని.. ఆ రోజు నాన్న నా భుజంపై చేయి వేయడాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు ఇష్టమైన రంగు నీలం అని, ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ యూరప్ అంటూ చెప్పుకొచ్చాడు. చివరిగా మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడగగా తన భార్యనే బెస్ట్ ఫ్రెండ్ అంటూ నమ్రత పేరు చెప్పుకొచ్చాడు. మహేష్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.