బిగ్ బ్రేకింగ్: మరోసారి క్యాన్సిల్ అయిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్..? ఫ్యాన్స్ డిసపాయింట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహించాలి అనుకుంటున్నారు మేకర్స్ .

కానీ తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా రీసెంట్ గానే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం అండ్ డేట్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా ప్రకటించింది మూవీ టీం . జనవరి 9న సాయంత్రం ఐదు గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో నిర్వహించబోతున్నట్లు ఓ పోస్ట్ పెట్టారు మూవీ టీం. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు .

అయితే కొందరు ఆకతాయిలు మళ్లీ గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తల ప్రచారం చేస్తున్నారు . నిజానికి అటువంటిది ఏదీ లేదు అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్న టయానికి అనుకున్న చోటు జరగబోతుంది అంటూ అఫీషియల్ గా మళ్లీ ప్రకటించారు మేకర్స్. దీంతో మహేష్ ఫ్యాన్స్ మళ్లీ జోష్ మోడ్ లోకి వచ్చారు. అయితే కావాలనే కొందరు గుంటూరు కారం సినిమాకి సంబంధించి నెగటివ్ ప్రచారం చేస్తున్నారు అని మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!