తేజ సజ్జ కోసం సమంత సంచలన నిర్ణయం..ఇక గుంటూరు కారం పని గొవిందా గోవిందా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకి కాంపిటీషన్ గా ఆయన సినిమాని రిలీజ్ చేస్తూ ఉండడం గమనార్హం . కాగా ఇలాంటి క్రమంలోనే తేజా సజ్జ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు . వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమాకు మంచి హైప్ తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్గా సమంతకి సంబంధించిన ఓ విషయాన్ని బయటపెట్టి టాక్ అప్ ది టౌన్ గా మారిపోయాడు తేజ సజ్జా. తేజ – సమంత కాంబినేషన్లో వచ్చిన సినిమా ఓ బేబీ . ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది . మంచి కలెక్షన్స్ అందుకుంది . అయితే రిపోర్టర్ ఎందుకు నువ్వు హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా.. ఓ బేబీ సినిమాలో చేసావు అని అడగ్గా సమాధానం ఇస్తూ ..”అప్పట్లో నాకు హీరోగా అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు. ఆ సమయంలో నాకు ఛాన్స్ ఇచ్చింది సమంత గారే .. ఈ కథ మొత్తం నా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది అని తెలియడంతో ఒప్పుకున్నాను “..

“అంతే కాదు సమంత గారు చాలా చాలా మంచివారు ..నాకు హెల్ప్ చేసి డైరెక్టర్ నందిని రెడ్డికి చెప్పి మరి కొన్ని సీన్స్ రాయించారు.. ఆమె ప్రోత్సాహంతో నేను ఇప్పటికీ ముందుకు వెళుతున్నాను “అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు పరోక్షంగా సమంత హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకు వచ్చాడు . దీనితో సమంత ఫ్యాన్స్ కూడా హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో బాగా జరుగుతూ ఉండడంతో హనుమాన్ హిట్ అవుతుంది అని గుంటూరు కారం యావరేజ్ గా నిలుస్తుంది అంటున్నారు పలువురు జనాలు..!!