నాలుగు ఫ్లాపులు పడగానే..ఓరిజినల్ క్యారెక్టర్ ని బయటపెట్టిన శ్రీలీల..!?

పాపం శ్రీ లీల.. తాను ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలచింది అన్నట్లు .. మొదట సినిమాలు హిట్ అయిన ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతూ రావడంతో శ్రీ లీలను కూడా ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసేసారు జనాలు . ఈ మధ్యకాలంలో శ్రీ లీలా నటించిన నాలుగు సినిమాలు ఫ్లప్ అయ్యాయి . భగవంత్ కేసరి తప్పిస్తే ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు హిట్ అవ్వలేదు.

గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఆ సినిమా హిట్ అయినా కూడా అది ఆమె ఖాతాలోకి రాదు . ఈ సినిమాలో ఆమెది ఒక బిస్కెట్ క్యారెక్టర్ . కేవలం డాన్స్ కి తప్పిస్తే మిగతా ఏ సీన్స్ కి ఎక్స్ప్రెషన్స్ కి శ్రీ లీల అర్హురాలు కాదు అంటూ ఆమె ఫ్యాన్సే చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ఒకవైపు.. వరుస ప్లాప్స్ తో సతమతమైపోతున్న శ్రీ లీల బాధను చూడలేక ఆమెకు ఎక్సలెంట్ సొల్యూషన్ ఇచ్చిందట వాళ్ళ అమ్మగారు .

 

వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. చూడాలి మరి వేణు స్వామి తో పూజలు చేయించుకున్న తర్వాత అయినా సరే శ్రీ లీల జాతకం కుదుటపడుతుందేమో..? ఆమె చేతిలో ప్రసెంట్ పదికి పైగా సినిమాలు ఉన్నాయి..!!