అయోధ్యలో కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. అసలు ఏమైందంటే..?

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే రామనామం మారుమ్రోగిపోతుంది . మనకు తెలిసిందే నేడు అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది . ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు . అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . మనం పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు చూసినా సరే చాలా ధైర్యంగా గంభీరంగా బోల్డ్ గా కనిపిస్తారు .

ఆయన కంటతడి పెట్టుకున్న దృశ్యాలు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం . కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో కన్నీరు పెట్టుకున్నారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉండగా బయట ఆడియన్స్ గ్యాలరీలో పవన్ కళ్యాణ్ కనిపించారు . అక్కడ నుంచి మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరంలో పవన్ కళ్యాణ్ దిగిన సెల్ఫీ కూడా వైరల్ అవుతుంది .

కాగా బాల రాముని ప్రాణ ప్రతిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.” శ్రీరాముడు మన భారత నాగరికత యొక్క వీరుడు అని ..రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తిలకించడం నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది అని.. శ్రీరాముడిని తిరిగి అయోధ్యలోకి తీసుకురావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది “అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు . ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ ట్వీట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!