“విడిపోయిన ఆవిషయంలో మేము ఒక్కటే”.. ప్రేమకు సరికొత్త అర్ధం చెప్పిన సమంత-నాగ చైతన్య..!

సమంత – నాగచైతన్య.. వీళ్లు విడిపోయి రెండేళ్లు పూర్తవుతుంది .అయినా సరే వీళ్లకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే వీళ్ళు విడాకులు తీసుకున్న సరే వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ మాత్రం ఇంకా అలానే ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు .

ఇప్పటికే పలు సందర్భాలలో ఆ విషయం పరోక్షకంగా ప్రూవ్ అయింది . అయితే రీసెంట్ గా మరొక ఇన్సిడెంట్ వాళ్ళ మధ్య ప్రేమ ఉంది అని చెప్పడానికి కారణమైంది . సమంత హీరో తేజ సజ్జాని సపోర్ట్ చేస్తూ హనుమాన్ సినిమాకు మంచి మార్కులు వేసింది . అంతేకాదు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తేజ సజ్జను ప్రశంసలతో ముంచెత్తింది. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా ట్విట్టర్ వేదికగా తేజసజ్జను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు. వీళ్లిద్దరు విడిపోయిన వీళ్లిద్దరి మధ్య ప్రేమ మాత్రం అలానే ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రెసెంట్ హీరోయిన్ సమంత సినిమాలు నిర్మించడానికి సిద్ధమవుతూ ఉంటే ..నాగచైతన్య తండేల్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు .ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది. రెండో హీరోయిన్ గా కీర్తి సురేష్ సెలక్ట్ అయ్యిందట..!!