పూజ చేసేటప్పుడు దేవుడికి అరటి పండ్లు ఎందుకు పెడతారో తెలుసా..!

భారత దేశం మొత్తం పూజలు చేసేటప్పుడు దేవుడు కడ అటుపళ్ళు పెడుతూ ఉంటారు. దేనిని మర్చిపోయిన అరటి పండ్లను మాత్రం పూజ దగ్గర పెట్టడం మర్చిపోరు. పూజ మండపానికి అరటి పిలకలు కూడా కడతారు. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక.. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడుతుంటారు. అలాగే పెళ్లి పందిళ్లకు కూడా దీన్ని కడతారు.

ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం ద్వారా సుఖసంతోషాలతో కుటుంబం మొత్తం ఉంటుందని భావిస్తారు. అలానే వినాయకుడికి ప్రీతి పాత్రమైన చెట్టు కూడా అరటి. ప్రతి ఇంట్లో నిత్యం పూజ గదిలో అరటి పండ్లను పెడుతుంటారు. ఇక పూజ గదిలో అరటి పండ్లను ఎందుకు పెడతారో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం తిని పారేసిన విత్తనాల నుంచి మొక్కగా మారి పండ్లను వీస్తాయి.

అలాంటి వాటిని దేవుడికి నివారించరాదు. స్వాతంత్రంగా ఎదిగిన మొక్కల నుంచి వచ్చిన పండ్లను మాత్రమే దేవుడికి పెట్టాలి. అలాంటి వాటిలో అరటిపండు ఒకటి. కాబట్టి అరటి ఇచ్చే పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడతాము. అందుకే అంత పవిత్రముగా భావిస్తాము. మనం దేశంలో కొన్ని ప్రత్యేక దినాల్లో అరటి పండును లక్ష్మీదేవికి, మహా విష్ణువుకి నివేదిస్తారు. అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజున అరటి పండ్లను ఆ దేవతలకు పెడితే లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతాం.