ప్ర‌భాస్‌కు ఇంత కోప‌మా… త‌ట్టుకోగ‌ల‌మా…!

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులాటి ద‌క్కించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తో తన ప‌వ‌ర్‌ ఏంటో ఆడియోస్ కు పరిచయం చేసిన ఈ డైనమిక్ డైరెక్టర్.. యానిమల్ మూవీ తో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇప్పటివరకు రణ్‌బీర్‌ కపూర్‌లో ఎప్పుడు చూడని యాంగిల్‌ని యానిమల్ ద్వారా సందీప్ రెడ్డి ప్రజెంట్ చేశాడు. కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా ఈ సినిమా గురించి చర్చించే రేంజ్ లో సందీప్ రెడ్డి సినిమా రూపొందించాడు.

ఒక సినిమా చేసిన తర్వాత విమర్శలు, ప్రశంసలు అన్నీ ఉంటాయి. ఈ మూవీకి కూడా ఆ రెండు వ‌చ్చాయి. అంతకుమించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఆడియన్స్ ద్వారా వచ్చింది. ఇక సందీప్ రెడ్డి మార్క్ మూవీ అంటేనే కచ్చితంగా హీరో రోల్ లో విపరీతమైన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ ఎమోషన్స్.. ఎక్స్ట్రీమ్ రేంజ్‌లో ఉంటాయి. అయితే సందీప్ రెడ్డి ఈ రేంజ్‌లో హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన.. ఆడియన్స్ వెంటనే యాక్సెప్ట్ చేసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు.

ఇక నెక్స్ట్ సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తెరకేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టారని సగం వరకు పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ యాంగ్రీ పోలీస్ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ మొదటిసారి ఓ పోలీస్ రోల్ లో నటించబోతున్నాడు. ప్రభాస్ గతంలో రాఘవేంద్ర సినిమాలో కోపం ఎక్కువ ఉన్న క్యారెక్టర్ లో కనిపించాడు. కాగా ఈ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.

అయితే తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రభాస్ కోపంగా నటించినా.. ఆ సినిమాలో మిగతా అన్ని ఎమోషన్స్ కూడా చూపించేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు స్పిరిట్ మూవీలో యాంగ్రీ పోలీస్ మ్యాన్ గా సందీప్ రెడ్డి ప్రభాస్ ని ప్రజెంట్ చేయబోతున్నాడు. ఇక గతంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో యాంగ్రీ కాప్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రభాస్ కూడా అదే రేంజ్ లో తననటన‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అంటూ నెటిజ‌న్లు భావిస్తున్నారు. మ‌రి కొంత‌మంది మాత్రం ప్ర‌భాస్‌కు ఇంత కోపం త‌ట్టుకోగ‌ల‌మా.. అస‌లు ఇది సెట్ అవుతుందా అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.