చరణ్ – బన్నీ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈయ‌న‌ నటన తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్ ” గేమ్ చేంజర్ ” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక అదే విధంగా అల్లు అర్జున్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది సీనియర్ నటులు ఉన్నప్పటికీ నటుడిగా మొదటిసారి అల్లు అర్జున్ కి అవార్డు దక్కింది. అంటే ఈయన యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరం అర్థం చేసుకోవచ్చు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన అల్లు అర్జున్.. భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్, రామ్ చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే వీరి కాంబోలో గతంలో ” ఎవడు ” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ అందులో ఇద్దరు కలిసి మాత్రం నటించలేదు. జస్ట్ ఒక 15 నిమిషాల పాత్ర కోసం బన్నీ సినిమాలో నటించాడు. అయినప్పటికీ ఈ సినిమాలో బన్నీ నటించిన పాత్రకి గొప్ప ప్రాధాన్యత దక్కింది. ఇక ఈసారి ఈ విధంగా కాకుండా ఒకే స్క్రీన్ పై ఇద్దరూ కలిసి ఉన్న స్టోరీ తో అల్లు అరవింద్ ఓ సినిమాని తెరకెక్కించనున్నాడట. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.