అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీసం మెలివేసే న్యూస్ ఇది.. పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . పుష్ప1తో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో పుష్ప2 తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నాడు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం.. అది కూడా 69 ఏళ్లుగా తెలుగు అభిమానులు వెయిట్ చేస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ వినిపించాడు . ఫాన్స్ ఎగరేసే గుడ్ న్యూస్ చెప్పారు . హరిష్ శంకర్ దర్శకత్వంలో ఓ యాడ్ చేసినట్లు ఆయన అఫీషియల్ గా ప్రకటించారు . దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా రిలీజ్ చేశారు . అన్నపూర్ణ స్టూడియోస్ లో యాడ్ కి సంబంధించిన షూట్ కంప్లీట్ చేసినట్లు చెప్పుకొచ్చారు .

హరీష్ శంకర్ – అల్లు అర్జున్ కాంబోలో దువ్వాడ జగన్నాథం వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో క్రేజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఇలాంటి టైం లోనే ఆ ఆశను ఈ విధంగా నెరవేర్చేశాడు అల్లు అర్జున్. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ యాడ్ ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!