సమంత టైం మరి ఇంత బ్యాడా..? ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన రెండు రోజులకే భారీ షాక్..!

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లు హీరోయిన్ సమంత ఆమె చేసిన ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమంతకు వరుసగా ఫ్లాప్స్ పడడం స్టార్ట్ అయ్యాయి . ఆ తర్వాత ఎవరూ ఊహించని రేంజ్ లో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి ఆమెకే సోకడం .. దాని కారణంగా సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్లు దూరం కావడం జరిగింది.

రీసెంట్గా ఆమె ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది . ట్రాలాల అనే ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన సమంత ఇక లైఫ్లో సెటిల్ అవుతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ సమంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన రెండు రోజులకే అక్కినేని ఫ్యామిలీ నుంచి భారీ షాక్ తగిలినట్టు తెలుస్తుంది . నాగచైతన్య కూడా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది .

అయినా కానీ నాగచైతన్య తన సొంత డబ్బులతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట . ఇప్పటికే పలు బిజినెస్ లు స్టార్ట్ చేసిన నాగచైతన్య సమంత ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన రెండు రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి వీళ్ల పట్టింపులు ఎంత వరకు వెళ్తాయో..?