కళ్యాణ్ రామ్ ఎంట్రీతో ప్లాన్ మార్చిన ఎన్టీఆర్…. ట్విస్ట్ అదుర్స్…!!

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలవుతుందని నందమూరి అభిమానులు భావించగా ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రంగా డెవిల్ తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లు సమాచారం.

ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో లో తెరకెక్కనున్న మూవీకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రస్తుతం దేవరకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో ఇబ్బంది పడుతున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ రీజన్ వల్లే ” దేవర ” మూవీ మేకర్స్ నిర్ణయం మారినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ దేవరా మూవీ ఎన్నో అంచనాలతో తెరకెక్కనుంది.

సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ కానుందని సమాచారం. ఇక దేవర టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని.. ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుందని సమాచారం. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా… ఈ సినిమాకి ఎన్టీఆర్ కూడా భారీ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక దేవర 1 ప్రమోషన్స్ లో దేవర 2 గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తారక్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది.