కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” టీజర్ వచ్చేసింది గా… సూపర్ హిట్ ప‌క్క అనే పవర్ఫుల్ కట్స్….!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. సంయుక్త మీనన్ హీరోయిన్గా.. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ “. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ఇది తెరకెక్కనుంది. అలాగే డిసెంబర్ 29న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ విషయానికి వస్తే… ఇది 2 నిమిషాల 20 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ గా హీరో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి ఉంది. ఇక ఇది కూడా పిరియాడికల్ డ్రామా కాబట్టి విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి అని ట్రైలర్తో చెప్పకనే చెప్పారు. అలాగే ఒక మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న ఏజెంట్ గా కూడా కళ్యాణ్ రామ్ కనిపించి ప్రేక్షకులని మెప్పించాడు.

ఇక సంయుక్త మీనన్ గ్లామర్ యాంగిల్ ను కూడా చూపించారు మేకర్స్. అనంతరం ఈమె పాత్రలో చాలా ఎమోషన్ దాగి ఉన్నట్లు హింట్స్ కూడా ఇచ్చారు. ” విశ్వాసంగా ఉండడానికి.. విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావా.. లయన్ ..” శవాలు సాక్ష్యం చెప్పడం ఎప్పుడన్నా చూశావా ” అంటూ కళ్యాణ్ రామ్ పలికిన డైలాగులు ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పక్క సూపర్ హిట్ అయ్యేలాగే ఉంది.